మహిళల సాధికారతే ప్రభుత్వం లక్ష్యం

by Sridhar Babu |
మహిళల సాధికారతే ప్రభుత్వం లక్ష్యం
X

దిశ, ఉట్నూర్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి వారి ప్రగతికి బాటలు వేస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. పాఠశాలలను అన్ని రకాలా అభివృద్ధి పరిచేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా మహిళ స్వయం సహాయక సంఘాలకు బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు.

త్వరలో రాష్ట్రంలో సోలార్ వాటర్ ప్లాంట్ల పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదింటి కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం ఆర్థికంగా ఎంతో భరోసాను కల్పిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సకాలంలో బ్యాంకులో జమ చేసి, ఆ డబ్బులను అభివృద్ధి పనులకు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్, అధికారులు, మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed