RK Roja: పవన్ కళ్యాణ్ ఆత్మ విమర్శ చేసుకో.. మాజీ మంత్రి రోజా సంచలన ట్వీట్

by Ramesh Goud |
RK Roja: పవన్ కళ్యాణ్ ఆత్మ విమర్శ చేసుకో.. మాజీ మంత్రి రోజా సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ(AP Assembly) సాక్షిగా అధికార పక్ష నేతలు చేసిన ఆరోపణలు పచ్చి అబద్దం అని తేలిపోయిందని, తప్పుడు ప్రచారం బట్టబయలైందని మాజీమంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా(YCP leader RK Roja) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన పత్రులను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆమె.. కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా.. అసెంబ్లీ సాక్షిగా ఇన్నాళ్లు టీడీపీ(TDP), జనసేన(Janasena) నేతలు చేసిన తప్పుడు ప్రచారం బట్టబయలైందని తెలిపారు.

అలాగే గత వైసీపీ ప్రభుత్వం(YCP Govt)లో వాలంటీర్ల(Volunteers) ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధమని(Blatant Lies) చెప్పారు. ఐదేళ్ళలో 34 కేసులు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి నమోదయ్యాయి అని సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) అసెంబ్లీ లో ప్రశ్నకి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చారని అన్నారు. అంతేగాక గతంలోనే మిస్సింగ్ కేసులలో 99.5 శాతంకి పైగా మహిళలను గుర్తించారని కేంద్ర హోంశాఖ(Union Home Ministry) కూడా పార్లమెంట్ లో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని, అధికారం కోసం ఎంతటి అబద్ధమైన చెప్తారా..? రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story