- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ బ్యూటీ.. ఆ అవార్డు పేరు పెట్టడంతో అంతా షాక్!

దిశ, సినిమా: అమీ జాక్సన్(Amy Jackson) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘ఎవడు’ (yevadu)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుష్(Dhanush), విజయ్(Vijay), విక్రమ్(Vikram) వంటి వారితో కూడా నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే అమీ జాక్సన్ వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌ(George Paniotou)ను ప్రేమించింది. ఇక పెళ్లి కాకుండానే ప్రియుడితో ఓ బిడ్డను కని అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత ఏవో మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి అమీ జాక్సన్ తన కొడుకు బాగోగులు చూసుకుంటూ ఉంటుంది.
గత ఏడాది మళ్లీ ఆమె అలెగ్జాండర్ వెస్ట్‌విక్(Alexander Westwick) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించిని విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన బేబీ బంప్ పిక్స్‌ను షేర్ చేస్తోంది. అయితే ఇటీవల అమీ జాక్సన్ నగ్నంగా ఫొటోషూట్‌తో నెట్టింట రచ్చ చేసింది. ఇక వాటిని చూసిన వారంతా ఓ బిడ్డకు తల్లివి కాబోతూ ఇలాంటి పనులేంటని అంతా ట్రోల్ చేశారు. అయినప్పటికీ ఈ అమ్మడు నిత్యం పలు పొటోలను షేర్ చేస్తోంది. తాజాగా, అమీ జాక్సన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫొటోను షేర్ చేసింది.
తనకు కొడుకు పుట్టాడని వెల్లడిస్తూ తన భర్త, కొడుకుతో తీసుకున్న ఫొటోను నెట్టింట పెట్టింది. ఇక ఇందులో ఈ జంట తెలుపు దుస్తులు ధరించి ఇద్దరి మధ్యలో పెట్టుకుని రొమాంటిక్ పోజు ఇచ్చారు. అంతేకాకుండా తమ బాబుకి ‘ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్‌విక్’ (Oscar Alexander Westwick)అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘ప్రపంచంలోనే ఇదే అత్యుత్తమ అనభూతి’’ అనే క్యాప్షన్ జత చేసింది. అది చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ ఆస్కార్‌కు వెల్‌కమ్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం షాక్ అవుతున్నారు.
Read More..
40 ఏళ్ల వయసులో అతనితో కలిసి ఆ పని చేస్తున్న ప్రభాస్ బ్యూటీ.. మార్నింగ్ షైనింగ్స్ అంటూ పోస్ట్