- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు?
దిశ, జూబ్లీహిల్స్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట శనివారం ఉదయం విచారణకు హాజరయ్యారు. ఏసీపీ వెంకటగిరి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పోలీసులు విచారించారు. జైపాల్ యాదవ్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. విచారణ అనంతరం జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. తిరుపతన్నకు తాను ఇచ్చిన రెండు ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ అయ్యాయని వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉండడంతో ఇద్దరి నంబర్స్ ఇచ్చినట్లు చెప్పారు. ఆ రెండు కాంటాక్ట్‌లకు చెందిన వారు రాజకీయాలకు సంబంధం లేదన్నారు.
''నాకు ఓ కుటుంబ వివాదం పరిష్కారం కోసం అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను కలిశాను. తిరుపతన్న మా సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో కుటుంబ వివాదాన్ని ఇద్దరం పరిష్కరించాము. నేను ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లు తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు వివరణ కోరారు. వారు కొన్ని ఆధారాలు ముందు పెట్టి విచారణ చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. ఎప్పుడు విచారణకు పిలిచినా నేను సహకరిస్తాను. ఈ ఇష్యూ పొలిటికల్‌కు సంబంధం లేదు'' అని జైపాల్ యాదవ్ కుండ బద్దలకొట్టినట్టు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు కేవలం పోలీస్ ఆఫీసర్ల ప్రమేయానికి సంబంధించి విచారణ కొనసాగించారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్ల ప్రమేయానికి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించిన తర్వాత బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నిందితులుగా చేర్చబోతున్నారా.. సాక్షులుగా పెట్టబోతున్నారా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటి వరకు ఎస్‌ఐబీ పనిచేసిన అధికారులను, టాస్క్‌పోర్స్‌లో పనిచేసిన డీసీపీ రాధాకిషన్ రావును విచారణ జరిపి.. వారికి సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత అందరినీ కూడా అరెస్ట్ చేసి జ్యూడిషిల్ రిమాండ్‌కు తరలించారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్ల ప్రమేయానికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. అప్పటి బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన నేతలకు కూడా ఒకటి రెండు రోజుల్లో నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారులతో మాజీ ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయని, ఎన్నికల సమయంలో కొందరు వ్యక్తుల నెంబర్‌ను అధికారులకు పంపించి వాళ్ల ఫోన్ ట్యాప్ చేయించారనే అభియోగాలు, ఆరోపణలతోనే మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు విచారిస్తున్నారు.