- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైద్యుల నిర్లక్ష్యంతో పుట్టిన శిశువు మృతి
దిశ, కామారెడ్డి : వైద్యుల నిర్లక్ష్యంతో ఓ పసికందు లోకం చూడకుండానే కడుపులోనే మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కామారెడ్డికి చెందిన రాధకు ఇందలవాయి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన శేఖర్ తో వివాహమైంది. మొదటి కాన్పులో మగబిడ్డ జన్మించగా..రెండవ కాన్పు కోసం శనివారం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. అయితే వైద్యులు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నిస్తుంటే..మొదటి కాన్పు ఆపరేషన్ అయిందని, ఇప్పుడు కూడా ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. అయినా వైద్యులు వినిపించుకోలేదు. సుమారు రెండు గంటల పాటు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించగా ఫలించలేదు. దీంతో ఆపరేషన్ చేసి మృత శిశువును కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవం కోసం సమయం వృధా చేసి తమ బిడ్డను చంపారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.