- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రూప్-3 పరీక్షలకు సర్వం సిద్ధం
దిశ, వరంగల్ బ్యూరో : ఈనెల 17,18 తేదీల్లో గ్రూప్ -3 పరీక్షలు జరగనున్నాయి. టీజీపీఎస్సీ గ్రూప్ -3 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా కేంద్రాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లా కేంద్రాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 174 కేంద్రాలను ఏర్పాటు చేయగా 63293 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.
జిల్లాల వారీగా చూసినట్లయితే వరంగల్ జిల్లాలో 28 పరీక్షా కేంద్రాల్లో 10,919 మంది అభ్యర్థులు, భూపాలపల్లి జిల్లాలో 17 పరీక్షా కేంద్రాల్లో 3707 మంది అభ్యర్థులు, హన్మకొండ జిల్లాలో83 కేంద్రాల్లో 33,456 మంది అభ్యర్థులు, ములుగు జిల్లాలో 9 కేంద్రాల్లో 2173 మంది అభ్యర్థులు, జనగామ జిల్లాలో 16 కేంద్రాల్లో 5446 మంది అభ్యర్థులు, మహబూబాబాద్ జిల్లాలో 21 పరీక్ష కేంద్రాల్లో 7592 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 174 పరీక్షా కేంద్రాల్లో 63293 అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ములుగు జిల్లాలో ఒక ట్రాన్స్ జెండర్ అభ్యర్థి కూడా పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షలను నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ఆయా శాఖల అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, విద్య, ఆర్టీసీ, విద్యుత్, వైద్య ఆరోగ్య, తదితర శాఖల అధికారులతో గ్రూప్ -3 పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
8:30గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి..!
17న ఉదయం 10.00 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. అయితే పరీక్షా కేంద్రం గేట్లు మాత్రం ఉదయం 9.30 గంటలకే మూసివేస్తారు. ఈలోపే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12.30గంటల వరకు పేపర్ 1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) పరీక్ష, సాయంత్రం 3.00 గంటల నుండి 5.30 గంటల వరకు పేపర్ -2 హిస్టరీ, పాలిటి అండ్ సొసైటీ పరీక్ష ( పరీక్ష కేంద్రం గేట్లు మధ్యాహ్నం 2.30 గంటలకు మూసివేస్తారు) ఉంటుంది. అదేవిధంగా తేదీ 18న కూడా ఇదే విధానం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్దేశించిన సమయం తర్వాత అభ్యర్థులెవరిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం కుదరదని స్పష్టం చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే పరీక్షకు సింహభాగంగా అభ్యర్థులు హనుమకొండ జిల్లాలో 33,456 మంది పరీక్ష రాయనున్నారు. సెల్ఫోన్, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్ తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. పరీక్ష జరిగేటప్పుడు ఎలాంటి అంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, పరీక్ష ఎంట్రెన్స్ గేట్, పరీక్ష కేంద్రాలు టేబుల్, చేర్స్ సానిటైజ్ చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గ్రూప్ -3 పరిక్ష కేంద్రాల చీఫ్ సూపెరెండెంట్లు ,రూట్ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధిత అధికారులతో పరీక్షలను పర్యవేక్షించనున్నారు.