Big Breaking News : మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఇంటిపై దాడి

by M.Rajitha |
Big Breaking News : మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఇంటిపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : మణిపూర్(Manipur) రాజధాని ఇంపాల్(Imphal) లోని సీఎం ఎన్ బీరెన్ సింగ్(CM N Biren Sigh) వ్యక్తిగత నివాసంపై శనివారం దుండగులు దాడికి ప్రయత్నించారు. దీంతో సీఎం ఇంటి బయట ఉన్న దుండగులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఘటనా సమయంలో సీఎం బీరెన్ సింగ్.. తన ఇంట్లో లేరని అధికార వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో ఆయన ఆఫీసులో సురక్షితంగా ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీఎం బీరెన్ సింగ్ ఇంటిపై దాడి నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం ఇంపాల్ లో కర్ఫ్యూ విధించింది. ఏడు జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపేసింది.

జిరిబామ్ జిల్లా పరిధిలో ముగ్గురు వ్యక్తుల హత్యకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన కారులు నిరసనలకు దిగారు. 24 గంటల్లో హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంపాల్ లోని ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల నివాసాల వద్ద కూడా ఆందోళనకారులు నిరసన తెలిపారు. ఇంపాల్ వెస్ట్ జిల్లాలోని సాగోల్ బండ్ ప్రాంతంలోని సీఎం బీరెన్ సింగ్ అల్లుడు – బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో ఇంటి ముందు ధర్నా చేశారు. రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎల్ సుసుంద్రో సింగ్ నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు దాడులకు దిగారు.

Advertisement

Next Story