- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KIMS Hospital: శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్(Sri Tej) ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ ఆసుపత్రి(KIMS Hospital) వైద్యులు వెల్లడించారు. రోజు రోజుకూ జ్వరం పెరుగుతోందని అన్నారు.
మెదడుకు ఆక్సిజన్ సరిగా అందడం లేదని.. బాలుడిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి(Revathi) మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. చికిత్స ఖర్చులూ భరిస్తానని, ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.