- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Supreme Court : అసాధారణ పరిస్థితుల్లోనే.. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ : సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో : అక్రమ నిర్మాణాల(illegal constructions) క్రమబద్ధీకరణ పథకాలను అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అమలు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది. పాలనాపరమైన జాప్యం, కాలయాపన, నగదు పెట్టుబడి వంటి కారణాలతో అక్రమ నిర్మాణాలను చట్టబద్ధం చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అక్రమంగా నిర్మించిన ఓ వాణిజ్య సముదాయాన్ని కూల్చివేయాలని 2014లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ రాజేంద్ర కుమార్ బర్జాత్యా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం 36 పేజీల తీర్పును వెలువరించింది.
మీరట్‌లో అక్రమంగా నిర్మించిన వాణిజ్య సముదాయం కూల్చివేతను సుప్రీంకోర్టు బెంచ్ సమర్ధిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టేందుకు అనుసరించాల్సిన పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ తీర్పు కాపీని అన్ని హైకోర్టులకు పంపించాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఇటువంటి వివాదాల విచారణ క్రమంలో తాజా తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. నివాస సముదాయాల విషయంలో పూర్తిస్థాయి సర్వే తర్వాత, అది కూడా ఒకేసారి ఈ చర్యలు ఉండేలా చూసుకోవాలని నిర్దేశించింది. పట్టణ ప్రణాళిక చట్టాలను పాటించడంతోపాటు అధికారులు జవాబుదారీతనంగా ఉండాలని తెలిపింది.