- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mysore Sandal Soap : ప్రభుత్వానికి ‘మైసూర్ శాండల్’ కంపెనీ డివిడెండ్ ఎంతో తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో : మైసూర్ శాండల్ సబ్బులు(Mysore Sandal Soap) చాలా ఫేమస్. వాటిని ఏదో ప్రైవేటు కంపెనీ తయారు చేస్తుంటుందని చాలామంది భావిస్తుంటారు. వాస్తవానికి ఆ సబ్బులను తయారు చేసేది ఒక ప్రభుత్వరంగ కంపెనీ. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్‌డీఎల్) అనే కంపెనీయే మైసూర్ శాండల్ సబ్బులను తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీ లాభాల్లోనే ఉంది. ప్రతి సంవత్సరం ఈ కంపెనీ తమకు వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా అందిస్తుంటుంది.
ఈక్రమంలో 2023-2024 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.108.62 కోట్ల డివిడెండ్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్, కేఎస్‌డీఎల్ ఛైర్మన్ నడ గౌడ, కంపెనీ ఉన్నతాధికారులు కలిసి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)కు మంగళవారం అందజేశారు. ఆ ఆర్థిక సంవత్సరంలో కేఎస్‌డీఎల్ కంపెనీకి రూ.362.07 కోట్ల లాభాలు వచ్చాయి. కంపెనీకి వచ్చిన లాభాల్లో దాదాపు 30 శాతాన్ని డివిడెండు రూపంలో రాష్ట్ర సర్కారుకు అందజేశామని కేఎస్‌డీఎల్ ఛైర్మన్ నడ గౌడ తెలిపారు. ఐదేళ్ల క్రితం రూ.15.91 కోట్ల డివిడెండును రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన కేఎస్‌డీఎల్ కంపెనీ.. ఇప్పుడు ఏకంగా రూ.108.62 కోట్ల డివిడెండ్‌ను ఇచ్చే స్థాయికి ఎదగడం చాలా గొప్ప విషయమని సీఎం సిద్ధరామయ్య కొనియాడారు.