Manipur: మణిపూర్‌లో భారీగా ఐఈడీలు స్వాధీనం.. ఇంఫాల్‌ జిల్లాలో భయాందోళనలు

by vinod kumar |
Manipur: మణిపూర్‌లో భారీగా ఐఈడీలు స్వాధీనం.. ఇంఫాల్‌ జిల్లాలో భయాందోళనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భద్రతా బలగాలు, మణిపూర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో భారీగా ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED)లు గుర్తించారు. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు భారత సైన్యం, మణిపూర్ పోలీసులు ఇంఫాల్ తూర్పు జిల్లా మాపిథెల్ రిడ్జ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలలో మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో 21.5 కిలోల బరువున్న ఐదు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. 3.5 కిలోల నుంచి 5.5 కిలోల వరకు ఉండే ఐఈడీలతో పాటు 25 మీటర్ల కార్డ్‌టెక్స్ కూడా పట్టుకున్నారు. వీటిని గుర్తించడంలో అవా, ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కీలక పాత్ర పోషించినట్టు అధికారులు తెలిపారు. దీంతో మణిపూర్‌లో భారీ ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. భారత సైన్యం, స్థానిక చట్ట అమలు సంస్థలు మణిపూర్ రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించే కార్యకలాపాలను అడ్డుకునేందుకు నిబద్ధతతో ఉన్నాయని తెలిపారు. భారీగా ఆయుధాలు పట్టుబడటంతో ఇంఫాల్ జిల్లాలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అంతకుముందు ఈ నెల 12న కూడా జిరిబామ్ జిల్లాలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.



Next Story

Most Viewed