Zakir Hussain: క్రికెటర్ కావాలనుకుని తబలా మ్యాస్ట్రోగా జాకీర్ హుస్సేన్

by Sathputhe Rajesh |
Zakir Hussain: క్రికెటర్ కావాలనుకుని తబలా మ్యాస్ట్రోగా జాకీర్ హుస్సేన్
X

దిశ, స్పోర్ట్స్ : సుప్రసిద్ధ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్(73) సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఈ తబలా మ్యాస్ట్రో తొలినాళ్లలో క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. తబలా శిక్షణను ఎగ్గొట్టి మరి స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడేవాడు. కానీ అతని తండ్రి ఉస్తాద్ అల్లా రఖ మాత్రం తబలాపై జాకీర్ సామర్థ్యాన్ని గుర్తించి దానిపైనే శ్రద్ధ వహించాలని సూచించాడు. క్రికెట్ కెరీర్ తన కుమారుడి తబలా వాయించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని భావించి తన తండ్రి తనకు అల్టిమేటం జారీ చేసినట్లు ఓ సందర్భంలో జాకీర్ హుస్సేన్ గుర్తు చేసుకున్నాడు. ‘ఓ సారి క్రికెట్ ఆడుతుండగా నా వేలు విరిగింది. ఆ సమయంలో నా తండ్రికి కోపం వచ్చింది. నేను కీపర్‌గా వ్యవహరించాను. ఆ సమయంలో మళ్లీ తాను తబలా వాయించగలనా.. లేదా అని నా తండ్రి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.’ అని జాకీర్ తెలిపాడు. ఇదే అంశం జాకీర్ జీవితాన్ని మలుపు తిప్పింది. తండ్రి ఉస్తార్ అల్లా రఖ సూచనలతో తబలా వైపే జాకీర్ మొగ్గు చూపాడు. కానీ భారత లెజెండ్ క్రికెటర్ సచిన్‌తో జాకీర్ హుస్సేన్ మంచి అనుబంధం ఉండేంది. వీరు మంచి స్నేహితులుగా కొనసాగారు. ఒక వేళ జాకీర్ హుస్సేన్ క్రికెటర్ అయి ఉంటే తనకున్న సహజ సామర్థ్యం కారణంగా స్పిన్నర్ అయ్యేవాడు. తదనంతరం తబలా వాయించడంతోనే ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది మనసుల్ని జాకీర్ హుస్సేన్ గెలుచుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed