పార్కింగ్ చేసిన వాహనాన్ని దొంగిలించిన వ్యక్తి అరెస్ట్..

by Kalyani |
పార్కింగ్ చేసిన వాహనాన్ని దొంగిలించిన వ్యక్తి అరెస్ట్..
X

దిశ,కార్వాన్ : పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని దొంగలించిన వ్యక్తిని అబిడ్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఇమ్మానుయేల్ తెలిపిన వివరాల ప్రకారం… ఆర్ ఎన్ రెడ్డి మీర్పేట్ కు చెందిన వాకముల్ల (47) మలక్పేట్ మెట్రో స్టేషన్ వద్ద ఏ ఎస్ వో గా పనిచేస్తున్నాడు. కాగా అక్టోబర్ 29న నాంపల్లి అసెంబ్లీ ఎదురుగా ఉన్న పిల్లర్ నెంబర్ 1252 సమీపంలో తన రాయల్ ఎన్ఫీల్డ్, గన్ మెటల్ గ్రే కలర్ ద్విచక్ర వాహనాన్ని ( ఏపి 30 ఏక్యూ6851) పార్క్ చేసి విధులకు వెళ్లాడు. కొంతకాలం తర్వాత తిరిగి తన వాహనాన్ని తీసుకునేందుకు పార్కు చేసిన స్థలానికి వచ్చాడు. అక్కడ తన వాహనం కనిపించకపోవడంతో చుట్టు ప్రక్కల ప్రాంతంలో వెతికిన ప్రయోజనం లేకపోవడంతో అబిడ్స్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కె.నరసింహ ఆధ్వర్యంలో ఎన్. గౌరేందర్ నేతృత్వంలోని 'క్రైమ్ టీమ్' బృందాన్ని ఏర్పాటు చేసి అబిడ్స్ లోని జిపిఓ వద్ద మహమ్మద్ ఖలీద్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని మంగళవారం రిమాండ్ కు తరలించగా నిందితుడి పై గతంలోనే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయినట్లు వారు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed