- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Bhujbal: నేను మీ చేతిలో బొమ్మను కాదు.. అజిత్ పవార్‌పై ఎన్సీపీ నేత ఛగన్ భుజ్ బల్ ఫైర్

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర (Maharashtra)లో ఏర్పాటైన కొత్త మంత్రి వర్గంలో తనకు చోటు దక్కకపోవడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Ncp) నేత ఛగన్ భుజ్‌బల్ (Chhagan Bhujbal) ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajith pawar), ప్రఫుల్ పటేల్ (Prapul Patel) లను ఉద్దేశించి మాట్లాడుతూ నేను మీ చేతుల్లో బొమ్మనా అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన నాగ్ పూర్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనను మంత్రివర్గంలో చేర్చుకోవడానికి అనుకూలంగా ఉన్నారని, అయితే అజిత్ మాత్రం దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. మంత్రి పదవి విషయమై అజిత్, ప్రపుల్ పటేల్‌లు నాతో చర్చిస్తారని చెప్పారు, కానీ ఇంత వరకు ఆ ప్రయత్నం జరగలేదని తెలిపారు.
‘గతంలో నేను రాజ్యసభకు వెళ్లాలనుకున్నాను. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేలా చేశారు. ఇప్పుడు వారం రోజుల క్రితం నాకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు. నేను దానిని తిరస్కరించాను. నేను రాజీనామా చేస్తే నా నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటారు? మీరు చెప్పిన దానికల్లా జై కొట్టడానికి నేను మీ చేతిలో బొమ్మనా?’ అని ప్రశ్నించారు. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిన మనోజ్ జరాంగేను వ్యతిరేకించినందుకే తనను మంత్రివర్గం నుంచి తప్పించారని ఆరోపించారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత అజిత్ పవార్‌తో మాట్లాడలేదన్నారు.