Dr. BR Ambedkar Open University: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ అడ్మిషన్లు

by Maddikunta Saikiran |
Dr. BR Ambedkar Open University:  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ అడ్మిషన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(HYD)లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ(BED) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://braou.ac.in/ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 21 డిసెంబర్ 2024. డిసెంబర్ 31న ప్రవేశ పరీక్ష నిర్వహించి జనవరి ఫస్ట్ వీక్ లో ఫలితాలను ప్రకటిస్తారు.

ప్రోగ్రాం డీటెయిల్స్:

బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(2024-25)

అర్హత:

కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీటెక్, బీఈ ఉతీర్ణులై ఉండాలి.

కోర్సు వ్యవధి:

రెండు సంవత్సరాలు

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 1 జులై 2024 నాటికి 21 ఏళ్లు పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

ప్రవేశ పరీక్ష ద్వారా సెలెక్ట్ చేస్తారు.

ట్యూషన్ ఫీజు:

రూ. 40,000.

Advertisement

Next Story

Most Viewed