- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పథకాలకు అనుమతివ్వండి: మంత్రి పయ్యావుల విజ్ఞప్తి
దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం అమలు చేయని కేంద్ర పథకాలపై చంద్రబాబు సర్కార్(Chandrababu Government) దృష్టి పెట్టింది. మొత్తం 93 కేంద్ర పథకాలను అప్పటి సీఎం జగన్(Former Cm Jagan) అమలు చేయాలని గుర్తించింది. ఈ మేరకు ఆ పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం 73 కేంద్ర పథకాలను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(State Finance Minister Payyavula కేశవ్).. మంగళవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Union Minister Nirmala Sitharaman)తో భేటీ అయ్యారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రానికి ఆర్థిక సాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వాటా పథకాలకు సంబంధించిన నిధుల విషయాన్ని నిర్మల దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, వెనుకబడి ప్రాంతాలకు కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక గ్రాంట్‌కు సంబంధించిన నిధులను విడుదల చేయాలని కోరారు. ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.