Nitish Kumar Reddy : నితీశ్ కుమార్ రెడ్డిపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు

by Sathputhe Rajesh |
Nitish Kumar Reddy : నితీశ్ కుమార్ రెడ్డిపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు
X

దిశ, స్పోర్ట్స్ : నితీశ్ కుమార్ రెడ్డి వయసుకు మించిన పరిణతి ప్రదర్శించి భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించాడని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. గబ్బా టెస్ట్ నాల్గవ రోజు నితీశ్ కుమార్ రెడ్డి 61 బంతులు ఆడి 16 పరుగులు చేశాడు. జడేజాతో కలిసి కీలకమైన 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఆటతీరుపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. ‘ఆస్ట్రేలియా బౌలర్లు బౌన్సర్ల బ్యారేజీలోకి నితీశ్‌ని లాగాలిని చూశారు. కానీ అతను ఎలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ఆడాడు. అడిలైడ్‌లో టైలండర్లు బ్యాటింగ్‌కు దిగే సరికి నితీశ్ ఔటయ్యాడు. ఈ సారి మాత్రం ఆ తప్పు చేయలేదు. పుల్ షార్ట్ ఆడేందుకు యత్నించలేదు. జడేజాతో భాగస్వామ్యం నెలకొల్పాలని నితీశ్‌కు తెలుసు. టెంపర్‌మెంట్ కారణంగా నితీశ్ బాయ్ నుంచి మెన్‌గా మారుతున్నాడు.’ అని గవాస్కర్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed