Formula E-Race Case: ఏసీబీకి సీఎస్ శాంతి కుమారి లేఖ

by Gantepaka Srikanth |
Formula E-Race Case: ఏసీబీకి సీఎస్ శాంతి కుమారి లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు(Formula E-Race Case)లో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. విచారణకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ(Governor Jishnu Dev Varma) అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. గవర్నర్‌ అనుమతి ఇచ్చిన లేఖను జతచేస్తూ తెలంగాణ సీఎస్ శాంతి కుమారి(CS Santhi Kumari) మంగళవారం ఏసీబీ(ACB)కి లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని ఏసీబీకి రాసిన లేఖలో సీఎస్ పేర్కొన్నారు.

ఈ-కార్‌ రేసింగ్‌ పూర్వాపరాలు, బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో దీని నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్‌(KTR) తీసుకున్న చర్యలు, ప్రజాధనం ఎలా విడుదల చేశారు?, నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందనే అంశాలపై లోతుగా విచారణ జరపాలని కోరారు. ఆర్‌బీఐ(RBI) అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం, ముందుగా డబ్బు చెల్లించి.. రెండు వారాల తర్వాత ఒప్పందం చేసుకోవడం, అది కూడా ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఉల్లంఘించి చేసుకోవడం ఇలా అనేక అంశాలు ఇందులో జరిగిన అక్రమాలు జరిగాయని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed