రాష్ట్ర వ్యాప్తంగా EAPCET పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులకు అధికారుల కీలక సూచన

by Shiva |
రాష్ట్ర వ్యాప్తంగా EAPCET పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులకు అధికారుల కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న EAPCET-2025 పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే EAPCET కన్వీర్ బి.డీన్ కుమార్ (B.Dean Kumar) విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. పరీక్షా సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ల (Exam Centers)కు 30 నిమిషాల ముందే చేరుకోవాలని పేర్కొన్నారు. ఇక ఎలక్ట్రానిక్ (Electronic), స్మార్ట్ వాచ్‌ (Smart Watch)లు, కాలిక్యులేటర్లు (Calculators), మొబైల్ ఫోన్ల(Mobile Phones)కు అనుమతి లేదని అన్నారు. ఇక ఎప్‌సెట్‌ పరీక్షా కేంద్రాలు ఉన్న రూట్లలో అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆర్టీసీ (RTC) అధికారులు అదనపు బస్సులను నడపుతున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎప్‌సెట్ కన్వీనర్ డీన్ కుమార్ (Dean Kumar) పేర్కొన్నారు.

అయితే, రాష్ట్ర వ్యాప్తంగా TD EAPCETకు 3,06,796 దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ (Engineering) విభాగానికి 2,20,049, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ (Agriculture and Pharmacy) విభాగంలో 86,493, ఆ రెండు విభాలకు కలిపి 254 అప్లికేషన్లు అందాయి. ఇందులో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షల కోసం 112 సెంటర్లు ఏర్పాటు చేశారు. మే 2 నుంచి 4 వరకు జరిగే ఇంజనీరింగ్ పరీక్షల కోసం 124 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎప్‌సెట్ పరీక్షలను సెషన్ల వారీగా నిర్వహించనున్నారు. ఫస్ట్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ప్రయోగాత్మకంగా EAPCET హాల్ టిక్కెట్లపై క్యూఆర్ కోడ్‌ (QR Code) ను ప్రింట్ చేశారు. దీంతో అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి రూట్ మ్యాప్‌ను సులభంగా తెలుసుకుని అక్కడికి సకాలంలో చేరుకోనున్నారు.



Next Story