AP DSC: డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియలో మరో కీలక అప్డేట్

by Anil Sikha |
AP DSC: డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియలో మరో కీలక అప్డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెగా డీఎస్సీ (Mega DSC) దరఖాస్తు సమయం దగ్గర పడుతుండడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ట్విట్టర్లో పలు సూచనలు చేశారు.మెగా డీఎస్సీ (Mega DSC) దరఖాస్తు సమయం దగ్గర పడుతుండడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ట్విట్టర్లో పలు సూచనలు చేశారు. డీఎస్సీ ఆశావహులు పరీక్షలపై దృష్టి కేంద్రీకరించి సన్నధం కావాలన్నారు. దరఖాస్తు అప్లోడ్ సమయంలో ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. డీఎస్సీ ఆన్​లైన్​ దరఖాస్తు పార్ట్ 2 కింద సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం ఇప్పుడు ఐచ్ఛికం అని తెలిపారు. ధ్రువీకరణ సమయంలో అసలు(ఒరిజనల్) సర్టిఫికెట్లను సమర్పించాలని సూచించారు. డీఎస్సీ అర్హత కోసం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల ప్రమాణాలు టెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు అంకితభావంతో చదివి విజయాన్ని సాధించాలని ఆయన కోరారు.


Advertisement
Next Story