నా భర్తను కొట్టి తప్పుడు స్టేట్‌మెంట్ తీసుకున్నారు: వర్రా కల్యాణి సంచలన ఆరోపణలు

by srinivas |   ( Updated:2024-11-16 16:55:58.0  )
నా భర్తను కొట్టి తప్పుడు స్టేట్‌మెంట్ తీసుకున్నారు: వర్రా కల్యాణి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి(Varra Ravindra Reddy)ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan), హోంమంత్రి అనిత(Home Minister Anita), వైఎస్ షర్మిల(YS Sharmila), విజయమ్మ(Vijayamma)పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు ఆయనపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్‌(Yemmiganoor Rural)తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి పత్తికొండ కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో వర్రా రవీంద్రా రెడ్డికి ధర్మాసనం రిమాండ్ విధించింది.

అయితే తన భర్త వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్‌పై భార్య వర్రా కల్యాణి(Varra Kalyani) ఆవేదన వ్యక్తం చేశారు. తన భ‌ర్తను ఈనెల 11న అదుపులోకి తీసుకున్నార‌న్నది అవాస్తవమని ఆమె చెప్పారు. 8న క‌ర్నూల్ టోల్‌ప్లాజా వ‌ద్ద అదుపులోకి తీసుకున్నారని, 12న మేజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రిచారని తెలిపారు. ఆ మూడు రోజుల పాటు రవీంద్రారెడ్డిని చిత్రహింస‌ల‌కు గురిచేసి, త‌ప్పుడు స్టేట్‌మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. తన భ‌ర్తకు జ‌రిగిన అన్యాయాన్ని అంద‌రికీ తెలియ‌జేస్తున్నానని వర్రా కల్యాణి పేర్కొన్నారు.

Advertisement

Next Story