ప్రముఖ పర్యాటక క్షేత్రంగా పర్వతాపూర్

by Naveena |
ప్రముఖ పర్యాటక క్షేత్రంగా పర్వతాపూర్
X

దిశ, నవాబుపేట: ప్రకృతి రమణీయమైన పర్వతాపూర్ అటవీ ప్రాంతంలో వెలసిన మహిమాన్విత మైసమ్మ దేవత ఆలయాన్ని ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి నూతన సంవత్సర పాలకవర్గం చైర్మన్ గా నియమితుడైన తిప్పిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు..మిగతా13 మంది పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన సన్మాన సభలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ..గత ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీ మేరకు దేవాలయాన్ని తన సొంత నిధులు కోటి రూపాయలతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. దేవాదాయ శాఖల మంత్రులను ఆలయానికి ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో.. ముమ్మరంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆలయ పరిసరాలను అహ్లాదకరంగా తీర్చి దిద్దడంతో పాటు..అమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

అమ్మవారి ఆశీస్సులతోనేతాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, ఆ దేవత రుణం తీర్చుకోవడం కోసం ఆలయాన్ని అత్యంత శీఘ్రంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. గతంలో ఆలయం పాలకవర్గ సభ్యులు పాల్పడిన అవినీతిని వెలికితీసి వారికి తగిన శిక్షలు పడే వరకు వదిలిపెట్టనని ఆయన హెచ్చరించారు. అవినీతి రహిత పాలనను అందించడమే తన ధ్యేయమని ఆయన అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో నియోజకవర్గంలో అవినీతికి పాల్పడిన వారి చిట్టా విప్పుతానని, అప్పుడు ఆ నాయకులే మాజీ ఎమ్మెల్యే దురాగతాలను అసహ్యించుకుంటారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకులందరికీ ఒకేసారి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని, అందువల్ల దశల వారీగా వారికి పదవులు ఇస్తూ..అందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దుష్యంత్ రెడ్డి, బంగ్లా రవి, బుక్క వెంకటేశం, కృష్ణయ్య, ఆల్వాల్ రెడ్డి, ఖాజా మైనొద్దీన్, తుల్సిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story