- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాతోళ్లే డీసీసీ అధ్యక్షులు..స్థానిక పోరు ముగిసే దాక...
దిశ,మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల (డీసీసీ అధ్యక్షుల) మార్పు స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఉండకపోవచ్చునని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పది సంవత్సరాల సుదీర్ఘ కాలం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తప్పనిసరిగా డీసీసీ అధ్యక్షుల మార్పు ఉంటుందని గత పది నెలలుగా ఆశావాహులు ఎదురుచూస్తూ ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తర్వాత కొత్త అధ్యక్షులను నియమిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పదవుల కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల కు చెందిన పలువురు నేతలు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున పైరవీలు చేస్తూ వచ్చారు.
మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడిగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఇప్పటికీ కొనసాగుతూ ఉండగా.. నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి స్థానంలో యువ నేత ప్రశాంత్ రెడ్డికి అవకాశం కల్పించారు. గద్వాల జిల్లాలో మాత్రం ఇప్పటివరకు డీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించలేదు. వనపర్తి జిల్లా కు సంబంధించి. ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడి నియమించిన నేపథ్యంలో ఆ జిల్లా, నారాయణపేట జిల్లాలు మినహాయించి మిగిలిన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష పదవుల కోసం ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల ద్వారా ఆశావహులు పలుమార్లు ప్రయత్నాలు చేశారు. కొందరు అయితే ఢిల్లీ స్థాయిలోనూ పైరవీలు చేసుకున్న ఇప్పటి వరకు డీసీసీ అధ్యక్షుల మార్పులు జరగలేదు.
పోటీ ఎక్కువ కావడం వల్లే...
డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పోటీ ఎక్కువ కావడంవల్ల అధిష్టానానికి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ తలనొప్పిగా మారినట్లు సమాచారం. మహబూబ్ నగర్ పీఠం కోసం మొత్తం 8 మందికి పైగా పోటీ పడుతుండగా.. నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలలోనూ ముఖ్య నాయకులు వారి వారి అనుచరులకు పదవిని దక్కించుకునేందుకు పోటీలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్షులు ఎంపిక అంశాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు.. అప్పుడు అంటూ ప్రచారం జరిగిన ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడు ఉమ్మడి పాలమూరు జిల్లా అంశంలో నిర్ణయాలు తీసుకోలేదు. డీసీసీ అధ్యక్షులు ఎంపిక విషయంలో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అధ్యక్షుల ఎంపిక ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు వారే..!?
స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల మార్పు ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోటీ తీవ్రత ఎక్కువగా ఉండడం.. తదితర కారణాల వల్ల పార్టీ అధిష్టానం ఎన్నికలలో నష్టం జరగకుండా ఉండాలంటే.. పాతవారిని యధావిధిగా కొనసాగించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తప్పనిసరిగా మార్చాల్సి వస్తే ఈ రెండు మూడు వారాల్లో మార్చవచ్చు.. లేదు అంటే పాతవారిని కొనసాగించి స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సన్నద్ధం కావడం జరుగుతుందని పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు.