Eatala Rajender: దేశం కోసం, ధర్మ రక్షణ కోసం అంటూ ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

by Ramesh N |
Eatala Rajender: దేశం కోసం, ధర్మ రక్షణ కోసం అంటూ ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, మన స్వేచ్ఛ కోసం వందల సంవత్సరాల క్రితం అనేక మంది ప్రాణాలు అర్పించారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు వారిని స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. ఈ మేరకు ఇవాళ సికింద్రాబాద్ గురుద్వారాలో (Veer Bal Diwas) వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో ప్రసంగించారు. గురు గోవింద్ సింగ్ ఆయన నలుగురు పిల్లలు యుద్ధంలో మరణించారని తెలిపారు. వారి బలిదానాల నుంచి మనకు ఈ స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయన్నారు. సిక్కు గురుదేవుల, వారి పిల్లల త్యాగాలను భవిష్యత్తు తరాలు గుర్తు చేసుకునే విధంగా ఉండాలని, స్ఫూర్తి పొందాలని భారత ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

బిర్సా ముండాతో పాటు అనేక మంది రియల్ హీరోస్ ఆఫ్ ఇండియాను గుర్తించి వారి జయంతులు, వర్థంతులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ అమరుల త్యాగాలు వృధా కావని చెప్పారు. వందల ఏళ్ల పాటు భరత జాతి ఏకోన్ముఖమై స్వాతంత్రం కోసం పోరాడారని, లక్షలాది మంది జైలు పాలయ్యారని గుర్తుకు చేశారు. వేలాదిమంది ప్రాణత్యాగాలు చేశారని, ఆ త్యాగాల ఫలితమే మన స్వాతంత్రమని వివరించారు. వీర్ బాల్ దివస్ పేరుతో ప్రధానమంత్రి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా జాతి స్ఫూర్తి పొందాలని ఈటల రాజేందర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed