- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనవరి 3న రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ లకు ముట్టడి : ఆర్ కృష్ణయ్య
దిశ, హిమాయత్ నగర్ : పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని, స్కాలర్ షిప్ లను రూ. 5500 నుంచి రూ. 20,000 లకు పెంచాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ లకు ముట్టడికి బీసీ విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఛలో కలెక్టరేట్ పోస్టర్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆయన అన్నారు. మూడేళ్ళుగా ఫీజులు బకాయిలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఖరితో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు రాకపోవడంతో కాలేజీలు మూసివేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి బకాయిల విషయంలో సానుకూలంగా ఉన్నారని... కానీ అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసే దానిపై ఉన్న శ్రద్ధ , విద్యార్థుల భవిష్యత్తు పై లేకపోవడం బాధాకరమన్నారు. రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను కాపాడాలని అన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని 16 లక్షల మంది విద్యార్థుల జీవితాలను కాపాడాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీసీ నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి, చంద్రశేఖర్, బి. రాజేందర్, రామకోటి రాందేవ్, వీరన్న, ఉమేష్ రమేష్, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.