Hyderabad:హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

by Jakkula Mamatha |
Hyderabad:హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Heavy Rains) కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం(Low Pressure) ప్రభావంతో నగరంలో వర్షం దంచికొడుతోంది. ఈ క్రమంలో అబిడ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, మణికొండ, నాంపల్లి, అల్వాల్, పంజాగుట్ట, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, లక్డీ కపూల్, ఉప్పల్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అలాగే మేడిపల్లి, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే బుధవారం ఉదయం నుంచి ఈ రోజు వరకు వాతావరణం చల్లగానే ఉంది. చలికాలంలో వర్షం పడుతుండటంతో చలి తీవ్రత(Cold intensity) పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో చిరు జల్లులు కురుస్తుండటంతో చలి తీవ్రత అధికమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed