TG Govt.: మాజీ ప్రధాని కన్నుమూత.. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

by Shiva |   ( Updated:2024-12-27 03:31:49.0  )
TG Govt.: మాజీ ప్రధాని కన్నుమూత.. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Former Prime Minister Manmohan Singh) గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రాష్ట్రంలోని విద్యా సంస్థలు (Education Institutions), ప్రభుత్వ కార్యాలయాలకు (Government Offices) ఇవాళ సెలవు దినంగా ప్రకటించింది. అదేవిధంగా వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanthi Kumari) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంతాపాన్ని తెలియజేశారు. ఆర్థిక సంస్కరణకు శ్రీకారం చుట్టి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను దేశం కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.




Advertisement

Next Story

Most Viewed