Annamalai : డీఎంకే ఓడిపోయే వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై శపథం

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-26 12:53:54.0  )
Annamalai : డీఎంకే ఓడిపోయే వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై శపథం
X

దిశ, నేషనల్ బ్యూరో : రాష్ట్రంలో డీఎంకే ఓడిపోయే వరకు చెప్పులు వేసుకోనని తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై శపథం చేశారు. గురువారం కోయంబత్తూరులో ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ‘డీఎంకే ప్రభుత్వం ఓడిపోయే వరకు చెప్పులు లేకుండానే నడుస్తాను. డబ్బులు పంచి ఎన్నికలు గెలవాలని తాము భావించడం లేదు. డబ్బులు వృథా చేయకుండా ఈ ఎన్నికల్లో పోరాడతాం.’ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో డీఎంకే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందన్నారు. మీడియాతో మాట్లాడుతుండగానే షూస్ తీసేసిన అన్నామలై.. డీఎంకే అధికారం కోల్పోయాకే మళ్లీ షూస్ ధరిస్తానన్నారు.

రాష్ట్రంలో ఆరు మురుగన్ ఆలయాలను సందర్శంచి 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ఆయన వెల్లడించారు. కొయంబత్తూరులోని తన ఇంటి దగ్గర రాష్ట్రంలో దుష్ట పాలన అంతం కావాలని ఆరు సార్లు కొరడాలతో కొట్టుకుంటా అన్నారు. లైంగిక వేధింపుల కేసులో 19 ఏళ్ల యువతి వివరాలను లీక్ చేసినందుకు పోలీసులపై ఆయన మండిపడ్డారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న 37 ఏళ్ల జ్ఞాన శేఖరన్ డీఎంకే నేతలతో దిగిన ఫొటోలను ఆయన రివీల్ చేసి మీడియా ఎదుట ప్రదర్శించారు. నార్త్-సౌత్ పాలిటిక్స్ పేరిట డీఎంకే రాష్ట్రంలోని సమస్యలను డైవర్షన్ చేస్తోందని ఆయన మండిపడ్డారు.

Advertisement

Next Story