- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ వద్ద మంటలు అంటుకొని బూడిదైన కార్లు...
దిశ,కార్వాన్ : లంగర్ హౌస్ పోలీసులు స్వాధీనం చేసుకున్న కారులలో మంటలు అంటుకొని చెలరేగడంతో స్థానికులు పరుగులు తీసిన సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంటలంటుకోవడంతో లంగర్ హౌస్ ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పడం తో అటు పోలీసులు, ఇటు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్స్పెక్టర్ రఘుకుమార్, ఫైర్ సీఐ దత్తు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... లంగర్ హౌస్ పోలీసులు తనిఖీ లో భాగంగా పట్టుకున్న వాహనాలు పోలీస్ స్టేషన్ ఇరుపక్కల రోడ్డుకు రెండు పక్కల భారీగా పార్కింగ్ చేశారు. ఈ క్రమంలో వాహనాలు చాలా రోజులుగా పార్కింగ్ చేయడంతో ఆ ప్రాంతంలో చెత్త పేరుకుపోయింది.
ప్రమాదవశాత్తు మంటలతో కార్లు కాలిపోతుండగా స్థానికులు ఉరుకులు, పరుగులు చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు లంగర్ హౌస్ ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని తగలబడుతున్న కార్ల మంటలను ఆర్పారు. పోలీసులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గతంలో కూడా మూడుసార్లు ఇక్కడ చేసిన పార్కింగ్ వాహనాలు కాలిపోయాయని ఫైర్ సీఐ దత్తు గుర్తు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను రోడ్డుపై పార్కు చేయడంతో నిత్యం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని వాహనదారులు మండిపడుతున్నారు. ఈ ప్రాంతంలో పార్కింగ్ చేసిన వాహనాలను పోలీసులు వెంటనే గోషామహల్ కు తరలించాలని వాహనదారులు స్థానికులు స్థానిక పోలీసులను కోరారు.