- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP: మూడు నెలలు ఇక్కడే ఉండటానికి సిద్దం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దిశ, వెడ్ డెస్క్: పేదల ఇళ్లను కూల్చబోమని హామీ ఇస్తే.. మూసీ ప్రక్షాళనకు తానే సహకరిస్తానని కేంద్ర బొగ్గు, గణుల శాఖమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమంలో భాగంగా అంబర్ పేట తులసీరామ్ నగర్(Tulsiram Nagar) లో రాత్రి బస చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణ(Telangana)లో అధికారంలోకి వచ్చేది బీజేపీ(BJP)నే అని స్పష్టం చేశారు.
సీఎం పదవి(CM Post) ఎవరిని వరిస్తుంది అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని, బీజేపీ అధిష్టానం(BJP Leadership) మాటే ఫైనల్ అవుతుందని చెప్పారు. అంతేగాక మా కార్యకర్తల్లో ఎవరికి పదవి వచ్చినా తనకు సంతోషమేనని అన్నారు. ఇక పేదల ఇళ్లను కూల్చబోమని రేవంత్ రెడ్డి హామీ ఇస్తే.. మూసీ ప్రక్షాళనకు తాను సహకరిస్తానని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఆయన విసిరిన ఛాలెంజ్ కి కట్టుబడి ఉన్నారా చెప్పాలని, పేదల ఇళ్లు కూలగొట్టకుండా మూసీ ప్రక్షాళన చేస్తానంటే తాను 3 నెలలు అయినా మూసీ వెంట ఉండటానికి సిద్దమేనని చెప్పారు. అంతేగాక నా ఛాలెంజ్ ను స్వీకరిస్తే.. మూడు నెలలు(3 Months) మూసీ ప్రాంతంలోనే కాపురం పెడతానని కేంద్రమంత్రి సవాల్ విసిరారు.