RBI: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా భారత్ సొంతం: ఆర్‌బీఐ గవర్నర్

by S Gopi |
RBI: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా భారత్ సొంతం: ఆర్‌బీఐ గవర్నర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్థికవ్యవస్థ, ఆర్థిక రంగం సిద్ధంగా ఉన్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇతర దేశాలతో సంబంధం కలిగి ఉన్న వాణిజ్య, ఇతర రంగాలు పటిష్టంగా ఉన్నాయని, కరెంట్ ఖాతా లోటు పరిమితుల్లోనే ఉందని దాస్ అభిప్రాయపడ్డారు. శనివారం కొచ్చి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారత ఆర్థికవ్యవస్థ స్థిరత్వం గురించి ప్రసంగించారు. భారత్ 675 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటిగా ఉందన్నారు. ద్రవ్యోల్బణానికి సంబంధించి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ స్థిరంగా ఉంటుందని భావిస్తున్నట్టు దాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాల ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ స్థిరంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు దాస్ స్పష్టం చేశారు. చాలా దేశాల కంటే భారత ద్రవ్యోల్బణం మెరుగ్గానే ఉందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed