- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Siddaramaiah : మహారాష్ట్రలో తప్పుడు యాడ్స్.. బీజేపీపై కేసు పెడతాం : సీఎం సిద్ధరామయ్య
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక(Karnataka)లో ప్రభుత్వ ‘గ్యారంటీ’ స్కీంలు అమలు కావడం లేదంటూ మహారాష్ట్రలో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నందుకు బీజేపీపై కేసు నమోదు చేస్తామని సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ప్రకటించారు. తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నందుకు బీజేపీ(BJP)కి తగిన గుణపాఠం నేర్పిస్తామన్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఉన్న మంగళ్ వేధా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
తమ రాష్ట్రంలో గ్యారంటీ స్కీంల అమలును చూసేందుకు సిద్ధమైతే.. ప్రధాని మోడీ సహా ఇతర బీజేపీ నేతల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయిస్తానని సిద్ధరామయ్య వెల్లడించారు. వాళ్లంతా కర్ణాటకకు వచ్చి సంక్షేమ పథకాల అమలును స్వయంగా చూడొచ్చన్నారు. ఒకవేళ గ్యారంటీ స్కీంలు రాష్ట్రంలో అమలు కావడం లేదని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మోడీ సహా బీజేపీ నేతలంతా అబద్ధాలు చెప్పడంలో ఆరితేరారని విమర్శించారు. తప్పుడు ప్రకటనలను ఉపసంహరించుకొని, మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.