- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > Zameer Ahmed Khan : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. కర్నాటక మంత్రికి సమన్లు
Zameer Ahmed Khan : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. కర్నాటక మంత్రికి సమన్లు
by Sathputhe Rajesh |
X
దిశ, నేషనల్ బ్యూరో : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్నాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌కు లోకాయుక్త పోలీసులు శనివారం సమన్లు జారీ చేశారు. డిసెంబర్ 3లోగా లోకాయుక్త ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కేసులో మంత్రి తెచ్చుకున్న స్టే గడువు ముగియడంతో మళ్లీ విచారణ ప్రారంభం అయింది. ఐఎంఏ పొంజి స్కామ్‌లో జమీర్ అహ్మద్ ఖాన్‌పై అగస్టు 2021లో ఈడీ దాడులు నిర్వహించింది. ఈ అక్రమాస్తుల కేసు తదుపరి దర్యాప్తును ఈడీ ఏసీబీకి అప్పగించింది. అనంతరం ఏసీబీ ఈ కేసును లోకాయుక్తకు అప్పగించింది. మంత్రిపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్(పీసీ) యాక్ట్ 1988 ప్రకారం లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తాజాగా లోకాయుక్త మంత్రికి సమన్లను శనివారం జారీ చేసింది. సమన్ల జారీపై మంత్రి జమీర్ ఖాన్ స్పందిస్తూ.. విచారణలో భాగంగా లోకాయుక్త సమన్లు జారీ చేసింది. ఇందులో కొత్తమే లేదని అన్నారు.
Advertisement
Next Story