- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీలక్ష్మీనరసింహుని దర్శనం.. మహద్భాగ్యం..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా భీమ్‍గల్ మండలం లింబాద్రి గుట్ట పై కొలువైన భక్తుల కొంగు బంగారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. అమెరికాలో స్థిరపడిన ముంబైకి చెందిన బొట్ల పురుషోత్తం కుటుంబం శనివారం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు ముప్పయ్యేళ్లుగా అమెరికాలో నివాసం ఉంటూ సొంతంగా సాఫ్ట్ వేర్ కంపెనీని నిర్వహిస్తున్న పురుషోత్తం బొట్ల తన తండ్రి శ్రీరాములు బొట్ల, సతీమణి శివరంజిని బొట్ల, కుమారుడు కునాల్ బొట్లతో పాటు వారి బంధువులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి మెట్లపూజ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి గర్భాలయానికి వెళ్లే మెట్ల మార్గం పై మెట్టు మెట్టుపై తమల పాకులో ఉంచిన హారతి కర్పూరంను వెలిగిస్తూ నారీకేళాలను కొడుతూ మెట్ల పూజను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వామి వారి సమక్షంలో ఆలయ అర్చకుడు నంబి నింబాచలం ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అన్నసత్రంలో స్వామి వారి సన్నిధిలో భోజనాలు కూడా చేశారు.
ఈ సందర్భంగా తమ కుటుంబం ముంబైలో స్థిరపడినప్పటికీ తాను అక్కడే పుట్టి అక్కడే చదువు కూడా పూర్తి చేసానని, అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ అవకాశం రావడంలో అక్కడికి వెళ్లి అక్కడే స్థిర పడ్డానన్నారు. తాను సొంతంగా సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించానన్నారు. బిజినెస్ పని మీద ఇండియాకు వచ్చినప్పుడు ఏ మాత్రం అవకాశం దొరికినా ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటానని పురుషోత్తం బొట్ల తెలిపారు. వారి తాతలు, తండ్రి సొంతూరు భీమ్‍గల్ పట్టణమేనన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు తమ ఆరాధ్య దైవమని, మా ఇంటి దేవుడని పురుషోత్తం బొట్ల అన్నారు. ఇక్కడికి వస్తే మాలో ఏదో తెలియని దైవానుభూతి పొందుతామని, ఇక్కడ ఈ వాతావరణంలో గడిపిన కొద్దిసేపైనా ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేమన్నారు. ఈ అనుభూతి అమెరికాలో ఎన్ని వేల డాలర్లు సంపాదించినా దొరకని అనుభూతికి లోనవుతామని, అంతటి దివ్యశక్తి స్వామివారిలో ఉందన్నారు. ఆ నమ్మకమే మమ్మల్ని ఇంత గొప్పగా బతికిస్తోందని పురుషోత్తం బొట్ల అన్నారు.