- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యాయం చేయండి
దిశ,కంటోన్మెంట్ : నేషనల్ హైవే 44 విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ లో కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 120 మంది ఇండ్లు కొల్పోతున్న బాధితులు చిన్నతోకట్ట, బోయిన్‌పల్లి ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరుపున ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి తమకు తగిన విధంగా న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. 1970 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు దామోదరం సంజీవయ్య కృషి వలన తమకు ఈ ఇండ్లు వచ్చాయని, అప్పటి నుంచి మూడు తరాలుగా తాము ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నామని బాధితులు ఎమ్మెల్యేకు వివరించారు.
ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ వలన తమ ఇండ్లు పోతున్నాయని, తమను వేరే ప్రాంతానికి తరలిస్తే తమ ఉద్యోగాలు, పిల్లల చదువులు, జీవనాధారం అన్నీ దెబ్బతింటాయని ఎమ్మెల్యేకు తమ బాధ వెల్లబోసుకున్నారు. ఇండ్లు కోల్పోతున్న వారికి ఎట్టి పరిస్థితులలోనూ నష్టం కలగకుండా తాను స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి తగిన నష్టపరిహారం ఇప్పించే బాధ్యత తనదే అని బాధితులకు ఎంఎల్ఏ భరోసా ఇచ్చారు. ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయంగా మరో చోట ఇండ్లు కూడా కట్టించి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ అందరూ వచ్చి మాట్లాడి బాధితులకు న్యాయం జరిగిన తరువాతనే ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందని, ఈలోగా ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే నమ్మి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.