- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్న కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి.. ఎందుకంటే..?
దిశ, వెబ్ డెస్క్: కన్న కొడుకును స్వయంగా తండ్రి సుపారీ ఇచ్చి హత్య చేయించిన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీలోని దిగువ మామిడి గుంపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగులరెడ్డి, నారాయణమ్మ దంపతులకు సోమశేఖర రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. కాగా సరిగ్గా పది సంవత్సరాల క్రితం సోమశేఖర రెడ్డి వేధింపులు భరించలేక అతని భార్య, ఐదేళ్ల కుమారుడు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై మహిళా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. సోమశేఖర రెడ్డి, తండ్రి గంగుల రెడ్డి లను అరెస్ట్ చేసి పోలీసులు వారిని జైలుకు పంపారు. జైలు శిక్ష పూర్తవడంతో సోమశేఖర రెడ్డి, తండ్రి గంగుల రెడ్డి ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చారు.
అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా సోమశేఖర్ రెడ్డి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. నిత్యం తండ్రిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు. దీంతో కొడుకు ఆగడాలు భరించలేకపోయిన తండ్రి అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా పుంగనూరు సమీపంలోని గానుగలగడ్డకు చెందిన ఇద్దరితో రూ.40 వేలు సుఫారీ ఇచ్చాడు. దీంతో సుపారీ తీసుకున్న ఇద్దరు వ్యక్తులు సోమశేఖర్ రెడ్డిని స్థానికంగా ఉన్న అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి.. హత్య చేశారు. కాగా అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పుంగనూరు పోలీసులు.. చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసు చేయించినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.