Pregnancy: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా.. ఈ మిస్టేక్స్ చేస్తే అంతే సంగతి

by Anjali |   ( Updated:2024-12-22 10:38:10.0  )
Pregnancy: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా.. ఈ మిస్టేక్స్ చేస్తే అంతే సంగతి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో గర్భం దాల్చడం(pregnant) అనేది చాలా క్లిష్టంగా మారింది. కొంతమంది మహిళలు ఎదురుచూడకుండానే తొందరగా ప్రగ్నెన్సీ అవుతారు. కానీ మరికొంతమంది మాత్రం పిల్లల కోసం హాస్పిటల్స్(Hospitals) చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. అయితే కొత్తగా పెళ్లైనా జంటలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. పలు రకాల తప్పుల్ని చేయకుండా ఉంటే సరిపోతుందని తాజాగా నిపుణులు సూచిస్తున్నారు. ప్రెగ్నెన్సీ విషయంలో తొందర పడొద్దు. అంటే ఎక్కువగా ఒత్తిడి(stress)కి గురి కావద్దు. అలాగే వారి పెళ్లి మా పెళ్లి ఓకేసారి అయ్యింది.. కానీ వారు మాకంటే ముందే తల్లిదండ్రులవ్వబోతున్నారంటూ ఇతరులతో అస్సలు పోల్చుకోకూడదు.

ఈ టెన్షన ఇబ్బందులకు దారితీస్తుంది. నేను ఇప్పుడే ప్రెగ్నెన్సీ అవ్వాలి, ఇదే నెలలో అవ్వాలి అనే ఆలోచనను మైండ్‌లో నుంచి వెంటనే తీసేయండి. ఈ కారణంగా కూడా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా మహిళలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటే తప్పకుండా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటరీల(Folic acid supplements)ను తీసుకోవాలి. దీంతో గర్భం దాల్చే చాన్సెస్ పెరుగుతాయి. అలాగే గర్భం హెల్తీగా ఉంటుంది. అలాగే మన జీవన శైలిలి అలవాట్లు కూడా మార్చుకోవాలి. లేకపోతే సంతానోత్పత్తిని ప్రభావితం చేసే ఎన్నో అంశాలున్నాయి. ధూమపానానికి దూరంగా ఉండాలి.

ఇక సిగరెట్(Cigarette) శరీర భాగాలపై ఏ విధంగా తీవ్ర ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇది అండాలు, స్పెర్మ్‌(Sperm)లోని జన్యు పదార్థాన్ని(Genetic material) దెబ్బతీస్తుంది పురుషుల్లో అంగస్తంభన(erectile dysfunction), స్పెర్మ్ కౌంట్‌(Sperm count)లో తేడా ఉంటుంది. ఆల్కహాల్‌(Alcohol)కు కూడా దూరంగా ఉండటం మేలు. అతిగా వ్యాయామం(exercise) చేయకూడదు. నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. టాక్సిన్స్ ఎఫెక్ట్(Effect toxins) ఉండకూడదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే జంటలు కెఫిన్‌కు దూరంగా ఉండాలి. రోజులో 200 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ కెఫిన్(Caffeine) తీసుకుంటే ప్రెగ్నెన్సీ పై ఎఫెక్ట్ చూపుతుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed