Skill University: తెలంగాణ స్కిల్ యూనివర్సిటీలో మరో నాలుగు కొత్త కోర్సులు..!

by Maddikunta Saikiran |
Skill University: తెలంగాణ స్కిల్ యూనివర్సిటీలో మరో నాలుగు కొత్త కోర్సులు..!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ(TG)లో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని(YISU) ఇటీవలే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ యూనివర్శిటీలో ప్రవేశాలకు అప్లికేషన్ ప్రక్రియ(Application Process) గత అక్టోబర్ నెలలో ప్రారంభమైంది. కాగా తొలి విడతగా వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్, ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సులను స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. రెండో విడుతలో భాగంగా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న మరో నాలుగు కోర్సులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు స్కిల్స్ యూనివర్శిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సప్లై చైన్ ఎసెన్షియల్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్, బ్యాంకింగ్ – ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ వంటి కోర్సులను యాడ్ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధులు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ వెబ్‌సైట్ https://yisu.in/లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వర్శిటీ అధికారులు తెలిపారు. కాగా స్కిల్ వర్శిటీ తాత్కాలికంగా ఖాజాగూడలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ప్రాంగణంలోనే ఉన్న భవనాల్లో కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story