China : అమెరికాకు చైనా మాస్ వార్నింగ్

by M.Rajitha |
China : అమెరికాకు చైనా మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : తైవాన్(Taiwan) కు అమెరికా(America) రక్షణ సహాయం అందించడంపై చైనా(China) సీరియస్ అయింది. అమెరికా ప్రమాదంతో చెలగాటం ఆడుకుంటుందని, దీనికి తగిన మూల్యం పొందుతుందంటూ వార్నింగ్ ఇచ్చింది. కాగా మరికొద్ది రోజుల్లో అధ్యక్షపదవి నుంచి వైదొలగనున్న జో బైడెన్(Jeo Biden) తైవాన్ కు 571.3 మిలియన్ డాలర్ల రక్షణ సాయంతోపాటు, 265 మిలియన్ డాలర్ల విలువైన మిలిటరీ ఆయుధాలు అమ్మడానికి అంగీకారం తెలిపారు. తైవాన్ రక్షణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు, మిలటరీ ట్రైనింగ్, యుద్ధ సామగ్రి కొనడానికి ఈ సహాయం చేసినట్టు బైడెన్ ప్రకటించారు. అమెరికా చర్యపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ జలసంధిలో శాంతిని దెబ్బతీసేందుకు అమెరికా కుట్రలు చేస్తుందని, తక్షణమే ఈ చర్యలు ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకొక తప్పదని చైనా మాస్ వార్నింగ్ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed