Tirumala:‘వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’.. టీటీడీ ఈవో సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
Tirumala:‘వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’.. టీటీడీ ఈవో సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల(Tirumala)లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని టీటీడీ ఈవో(TTD EO) శ్యామలరావు(Shyamala Rao) వెల్లడించారు. తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించామని తెలిపారు. ఈ క్రమంలో నేడు(ఆదివారం) తిరుమలలో ఈవో శ్యామలరావు విలేకర్ల సమావేశం(Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు(CM Chandrababu) భక్తులకు ఎటువంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయ పవిత్రతను కాపాడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమల పర్యటనను ప్రతి భక్తుడు గుర్తుపెట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచామని అన్నారు. భక్తులు(Devotees) క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే ఇబ్బందులు ఇక నుంచి ఉండవని తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించామని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించామన్నారు. తిరుమలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు టీటీడీ ఈవో అన్నారు. ‘2047 తిరుమల విజన్‌’లో(2024 Tirumala Vijan) భాగంగా అనేక కార్యక్రమాలు చేయాలి. దాతలు నిర్మించిన అతిథి గృహాల్లో 20 గృహాలకు ఆధ్యాత్మిక పేర్లు పెట్టాలి. అలిపిరి నడక మార్గంలో సౌకర్యాలు, తిరుమలలో పార్కింగ్ సౌకర్యం పెంచాలని వ్యాఖ్యానించారు. అన్యమత ఉద్యోగుల బదిలీపై న్యాయపరంగా వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆలయ పరిధిలో అనధికార దుకాణాల(Unauthorized shops) వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed