Allu Arjun: అంత గొప్పగా ఎవరూ నటించలేరంటూ అల్లు అర్జున్‌పై పూనమ్ ట్వీట్

by Hamsa |   ( Updated:2024-12-22 05:16:25.0  )
Allu Arjun: అంత గొప్పగా ఎవరూ నటించలేరంటూ అల్లు అర్జున్‌పై పూనమ్ ట్వీట్
X

దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. అయితే ఈ మూవీ ప్రీమియర్ షోలు వేయగా.. ఊహించని సంఘటన చోటుచేసుకుంది. తొక్కిసలాట జరగడంతో ఓ మహిళ మరణించగా.. ఆమె కుమారుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలోనే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీ సమావేశాల్లో సినీ ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీనిపై అల్లు అర్జున్(Allu Arjun) కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు లేదని తనకు కూడా ఓ కొడుకు ఉన్నాడని విమర్శలు చేయకండని అన్నారు. ఇక వీరిద్దరి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

కొందరు సీఎం ఆవేదనలో అర్థం ఉంది.. ప్రమాదానికి గురైన ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి.. 6 గంటలు జైల్లో ఉన్న హీరో ఇంటికి పరామర్శకు వెళ్లడం ఏంటని సీఎంకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘పుష్ప-2’ సినిమా చూసిన పూనమ్ కౌర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘‘మొత్తానికి పుష్ప-2 మూవీ చూశాను. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర ఎలాగో.. గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార, సంస్కృతులను బాగా చూపించారు. బన్నీ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం పూనమ్(Poonam) పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు అందరిదీ ఒక బాధ అయితే నీది ఓ బాధ. బన్నీ మధ్యలో ఇరుక్కున్నారు అంటే ట్వీట్లు వేస్తున్నావా అని ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed