Purandeswari: తొక్కిసలాట ప్రేరేపితం కాదు.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-12-22 06:08:51.0  )
Purandeswari: తొక్కిసలాట ప్రేరేపితం కాదు.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 విడుదల ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ (RTC Cross Roads)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తోపులాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చివరో రోజు అసెంబ్లీ సమావేశాల్లోనూ (Assembly Sessions) ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ కేసులో చిక్కడపల్లి (Chikkadpally) పోలీసులు అల్లు అర్జున్‌ (Allu Arjun)ను అరెస్ట్ చేయగా.. హైకోర్టు (High Court) ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్‌ (Arrest)పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) స్పందించారు. సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ప్రేరేపితం కాదని.. ఊహించని పరిణామంతో జరిగిందని అన్నారు. ఓ హీరోగా అల్లు అర్జున్ (Allu Arjun) థియేటర్‌కు వెళ్లారని తెలిపారు. కానీ, కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా.. A11గా ఉన్న అల్లు అర్జున్‌ను మాత్రమే అరెస్ట్ చేయడం సరికాదని పురందేశ్వరి అన్నారు.

Also Read: అల్లు అర్జున్ చెప్పేదానిలో నిజం లేదు.. అతను చేసిన 10 తప్పులు ఇవే అంటూ ఫైర్ అయిన ఓ నెటిజన్..

Advertisement

Next Story

Most Viewed