- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vande bharat Train: వందే భారత్ రైలు భోజనంలో కీటకాలు.. స్పందించిన రైల్వే శాఖ
దిశ, నేషనల్ బ్యూరో: మెరుగైన సేవలందించేందుకు వందే భారత్ రైళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ రైళ్లలో లభించే సౌకర్యాలపై ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణీకులకు అందించే భోజన నాణ్యతపై ఫిర్యాదులు, విమర్శలు ఎక్కువయ్యాయి. తాజాగా తిరునల్వెలి నుంచి చెన్నైకి ప్రయాణించే వందే భారత్ రైల్లో ఓ ప్రయాణికుడికి వడ్డించిన భోజనంలో కీటకాలు వచ్చాయి. సదరు ప్రయాణికుడికి ఇచ్చిన సాంబార్‌లో నల్లటి కీటకాలు ఉన్నాయని వీడియో సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. అదే రైళ్లో ప్రయాణిస్తున్న చాలామంది ప్రయాణికులు రైలు సర్వీస్ బాగానే ఉన్నప్పటికీ, ఆహారం సంతృప్తికరంగా లేదని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వీడియోను కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగుర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేశారు. పరిశుభ్రత, ఐఆర్‌సీటీసీ జవాబుదారీతనంపై ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన రైల్వే శాఖ తక్షణం విచారణకు ఆదేశించామని, ఫిర్యాదు వచ్చిన ఫుడ్ ప్యాకేజీని దిండిగల్ స్టేషన్‌లోని హెల్త్ ఇన్‌స్పెక్టర్‌కు అందించినట్టు చెప్పారు. ఫుడ్ ప్యాకెట్ మూతపై పురుగులు అంటుకున్నట్టు విచారణలో తేలిందని రైల్వే అధికారులు చెప్పారు. ఈ వ్యవహారంలో సర్వీస్ ప్రొవైడర్‌కు రూ. 50,000 జరిమానా కూడా విధించినట్టు వెల్లడించారు. ఆహార నాణ్యతకు సంబంధించి రైల్వే శాఖ కట్టుబడి ఉందని, ప్రయాణికుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిస్తున్నామని స్పష్టం చేసింది.