- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TPTF: కామన్ స్కూల్ విద్యావిధానం అమలుచేయాలి.. ఆకునూరి మురళికి టీపీటీఎఫ్ వినతి
దిశ, తెలంగాణ బ్యూరో : మినిస్టర్ పిల్లలైనా, అటెండర్ పిల్లలైనా, కలెక్టర్ పిల్లలైనా, కార్మికుల పిల్లలైనా ఒకే పాఠశాలలో చదువుకునే కామన్ స్కూల్ విద్యా విధానాన్ని(Common School Education System) ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(Telangana Progressive Teachers Federation)(టీపీటీఎఫ్)(TPTF) నాయకులు డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ నేతలు ఎస్‌సీఈఆర్టీ కార్యాలయం(SCERT Office)లో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్(Telangana Education Commission Chairman) ఆకునూరి మురళి(Akunuri Murali)ని శనివారం కలిశారు. ఈ సందర్భంగా విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులపై పలు ప్రతిపాదనలు చేసిన రిపోర్టును అందించినట్లు టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్(Ashok Kumar), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి(Nagireddy) తెలిపారు. రాజ్యాంగ లక్ష్యాలకు భిన్నంగా ఉన్న నూతన జాతీయ విద్యావిధానాన్ని(National Education Policy) రాష్ట్ర ప్రభుత్వం(State Government) తిరస్కరించాలని కోరారు.
విద్యార్థులకు శాస్త్రీయ విద్యా విధానానికి అనుగుణంగా ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగిన అభివృద్ధిని పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించకూడదని, ఆన్ లైన్ క్లరికల్ వర్క్ లేకుండా చేయాలని కోరారు. మండల, జిల్లా, జోనల్ స్థాయిలో రెగ్యులర్ పద్ధతిలో పర్యవేక్షణాధికారులైన డీఈవో(DEO), డిప్యూటీ ఈవో(Deputy EO), ఎంఈవో(MEO) పోస్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని, విద్యార్థులకు పాఠ్య పుస్తకాల భారం తగ్గిస్తూ మార్పులు చేయాలని వివరించారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం స్నాక్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం నెలనెలా చెల్లించాలని పేర్కొన్నారు. కాగా ఈ అంశాలపై ఆకునూరి మురళి సానుకూలాంగా స్పందించారని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించి సిఫారసులు ప్రభుత్వానికి అందజేస్తామని హామీ ఇచ్చారని టీపీటీఎఫ్ నాయకులు తెలిపారు. ఆకునూరిని కలిసిన వారిలో టీపీటీఎఫ్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎం రవీందర్, ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకుడు ప్రకాష్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నన్నెబోయిన తిరుపతి, డీ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు వేణుగోపాల్, కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు.