- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi: ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ మూడవ దశ కింద కాలుష్య నిరోధక చర్యలకు మొదటి రోజు సుమారు రూ. 5.85 కోట్ల జరిమానాలను అధికారులు విధించారు. అధికారులు కాలుష్య నియంత్రణకు అన్ని రకాల చర్యలను తీవ్రతరం చేసినప్పటికీ, ఢిల్లీలోని గాలి నాణ్యత శనివారం మరింత దిగజారింది. అనేక ప్రాంతాలు 'తీవ్రమైన' కేటగిరీలో ఉన్నాయి. ఢిల్లీలో శనివారం సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 417గా నమోదు అయ్యింది. శుక్రవారం ఇది 396గా ఉంది. ఢిల్లీలోని 39 మానిటరింగ్ స్టేషన్లలో డేటా ప్రకారం, శ్రీ అరబిందో మార్గ్ మినహా మిగిలిన ప్రాంతాల్లో గాలి నాణ్యత 'తీవ్రమైన' స్థాయిలో ఉంది. ఆయా ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు 400 కంటే ఎక్కువగా ఉన్నాయి. జీఆర్ఏపీ మూడవ దశ కింద ఆంక్షలు శుక్రవారం నుండి అమల్లోకి వచ్చినందున, అధికారులు ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ వాహనాలపై నిషేధాన్ని ఉల్లంఘించినందుకు దాదాపు 550 చలాన్‌లను జారీ చేశారు. జీఆర్ఏపీ మూడవ దశ కింద మొదటి రోజున రూ. 1 కోటికి పైగా జరిమానా విధించారు. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (పీయూసీసీ) లేని వాహనాలపై కూడా పోలీసులు మొత్తం రూ.4.85 కోట్ల జరిమానా విధించారు.