- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News : ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్‌లో అట్టడుగు స్థానంలో హైదరాబాద్
దిశ, వెబ్ డెస్క్ : ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్(FQI)లో హైదరాబాద్(Hyderabad) అట్టడుగు స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCB) ఈ సర్వేలో పలు భయంకర నిజాలు వెళ్లడయ్యాయి. కల్తీ ఆహారానికి సంబంధించి భారత్‌లోని ప్రముఖ 19 నగరాల్లో క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ సర్వే చేపట్టింది. ఆహార నాణ్యత ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సర్వే చేపట్టగా.. హైదరాబాద్ ఆఖరి స్థానంలో నిలిచింది. కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్‌లో నిలువగా.. నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్ సైతం కనీసం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విషయం సర్వేలో బయటపడింది.
ఇటీవల కాలంలో హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్లో కుళ్లిపోయిన పదార్థాలను వినియోగించడం, నాసిరకమైన పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలింది. దాదాపు 62శాతం హోటల్స్‌లో గడువు తీరిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పలు హోటల్స్ లో ఆహారం తీసుకున్న పలువురికి ఫుడ్ పాయిజనింగ్ జరిగిన విషయం తెలిసిందే. గడిచిన రెండునెలల్లోనే నగరంలో 84శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసులు రికార్డయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. హోటల్స్, రెస్టారెంట్లలో ఆహారపదార్థాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించే వరకు దాడులు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.