- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi : రాహుల్ గాంధీ బ్యాగు తనిఖీ.. కాంగ్రెస్ సీరియస్
దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ బ్యాగును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో భాగంగా మహారాష్ట్రలోని అమరావతి దమన్‌గావ్‌లో రాహుల్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక, ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. హస్తం పార్టీ మాజీ మంత్రి, తియో ఎమ్మెల్యే యశోమతి ఠాకూర్ తాజా ఘటనపై స్పందిస్తూ.. పీఎం మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం ఏక్ నాథ్ షిండే బ్యాగులను ఎందుకు తనిఖీ చేయడం లేదని ప్రశ్నించారు. తన బ్యాగును ఇటీవల ఎన్నికల అధికారులు తనిఖీ చేయగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాయుతి కూటమి నేతల బ్యాగులను ఎందుకు తనిఖీ చేయడం లేదని శివసేన (యూబీటీ) ఫైర్ అయింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా రాజకీయ నాయకుల బ్యాగులను తనిఖీ చేయాలని ఈసీ ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.