కేరళలో మంకీ పాక్స్ కలకలం.. ఇద్దరికి పాజిటివ్

by srinivas |
కేరళలో మంకీ పాక్స్ కలకలం.. ఇద్దరికి పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్: కేరళలో మంకీ పాక్స్(Monkey Pox) కలకలం రేగింది. యూఏఈ నుంచి ఇటీవల కేరళ(Kerala)కు వచ్చిన ఇద్దరికి పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, శరీరంపై పలు చోట్ల పొక్కులు వచ్చి నీటి బొడిపెలుగా మొదలై ఎరుపు, నలుపు రంగులోకి మారాయి. దీంతో వైద్యులు పరీక్షలు చేసి మంకీ పాక్స్ సోకినట్లు నిర్ధారించారు. ఇద్దరిని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే ఇద్దరు వ్యక్తులకు మంకీ పాక్స్ సోకిన విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్(State Health Minister Veena George) అధికారికంగా ప్రకటించారు.

కాగా మంకీ పాక్స్ ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికించింది. మొత్తం 122 దేశాల్లో 99, 518 మందికి మంకీ పాక్స్ సోకింది. ఈ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందింది. దీంతో అక్కడ ప్రభుత్వం గతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే మంకీ పాక్స్ కేసులు భారత్‌లోనూ నమోదు అయ్యాయి. సెప్టెంబర్ 9న తొలి కేసు కేరళలో నమోదు అయింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్ సోకినట్లు సెప్టెంబర్ 18న కేరళ ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా కూడా కేరళలోనే మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో అక్కడి ప్రజలు అందోళనలు చెందుతున్నారు. మంకీ పాక్స్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Next Story