TGO: ఈ నివేదికను ప్రభుత్వానికి అందచేయండి.. టీజీఓ అధ్యక్ష్యుడు

by Ramesh Goud |
TGO: ఈ నివేదికను ప్రభుత్వానికి అందచేయండి.. టీజీఓ అధ్యక్ష్యుడు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వేతన సవరణ కమిటీ ఏర్పడి సంవత్సరం దాటిందని, ఇక నైనా ప్రభుత్వానికి నివేదికను వెంటనే అందచేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల(Telangana Gezited Officers) సంఘం ఈ మేరకు పిఆర్​సి కమిషన్​ను(PRC Commission) కోరింది. ఈ మేరకు బుధవారం టిజిఓ అధ్యక్ష్యుడు ఏలూరి శ్రీనివాసరావు(TGO President Eluri Srinivasa Rao) నేతృత్వంలో ఉద్యోగుల బృందం పిఆర్​సి కమిషన్​ఛైర్మన్ శివశంకర్ ను కలసి వినతిపత్రం అందజేసింది. వేతన సవరణ కమిటీ మొదటి ఆరు నెలలు అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి జి ఓ 159 పై 2023 ఆక్టోబర్ 2 న ప్రతిపాదనలను స్వీకరించి , నమోదు చేసుకుందని టి జి ఓ తెలిపింది. అయితే శివశంకర్ ను ఛైర్మన్ గా ఏర్పాటు చేసిన క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తాజాగా ఏప్రిల్ 2025 నుండి వేతన సవరణ అమలు చేస్తామని హామీ ఇచ్చారని, త్వరగా నివేదికను అందచేస్తే ప్రభుత్వం అద్యయనం చేసి అమలు చేయడానికి వీలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వానికి అందచేసే ముందు పి ఆర్ సి నివేదికలో పలు అంశాలను పరిగణించి , పొందుపరచి ప్రభుత్వానికి అందించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్​ చేశారు.

ఇప్పటి వరకు పెండింగ్ లో (1 -1- 2023 ,1-7-2023,1-1-2024,1-7-2024 వరకు )నాలుగు కరువు భత్యాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉందని తెలిపారు. వీటిలో 1-1-2023, 1-7-2023 న ఇవ్వాల్సిన రెండు కరువు భత్యాలను వేతన స్థిరీకరణలో విలీనం చేసి, మూల వేతనమునకు 40 శాతం ఫిట్ మెంట్ ను కలిపి పిఆర్సీ అమలు చేయడానికి అనువుగా సిఫారసు చేయాలని కోరారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, టోకు , వినియోగ ధరల సూచీ, వైద్య విద్య ఖర్చులతో ప్రభుత్వ ఉద్యోగులు సంక్షోభానికి లోనవుతున్నారని గృహ, విద్యా రుణాల వాయిదాల చెల్లింపులో ఇక్కట్ల పాలవుతున్నారని టి జి ఓ అధ్యక్ష్యుడు ఏలూరి శ్రీనివాసరావు ఈ మేరకు పిఆర్​సి కమిషన్​దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తీసుకుంటున్న వేతనానికి తీవ్ర వ్యత్యాసం ఉండి సతమవుతున్నారని , నెలకు కనీసంగా 20 వేల రూపాయలను అదనపు భారానికి ఉద్యోగులు లోనవుతున్నారని తెలిపారు. ఇప్పటికే పిఆర్ సి కమిటీ తన సిఫార్సుల అందచేతలో 8 నెలలు జాప్యం జరిగిందని , ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా ప్రభుత్వానికి అందచేయాలని పిఆర్​సి కమిషన్​ను కోరారు. పిఆర్​సి కమిషన్​ఛైర్మన్​ శివశంకర్ ను కలసిన బృందంలో టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సహ అధ్యక్ష్యుడు బి. శ్యామ్, ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు, సంయుక్త కార్యదర్శి పరమేశ్వర్ రెడ్డి, యం పి డి ఓ ల సంఘ అధ్యక్ష్య కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, మరిపల్లి రంగారెడ్డి , టి జి ఓ అధ్యక్ష్యుడు డాక్టర్ రామారావు , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed