- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెరుగైన వైద్య సేవలు అందించండి
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రం బస్ స్టాండ్ లోని ఆర్టీసీ క్లినిక్ కు నూతనంగా నియమితులైన డాక్టర్ రమాకాంత్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా..బుధవారం ఆయన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులతో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి మాట్లాడారు. గత రెండు నెలల నుండి క్లినిక్ లో డాక్టర్,ఫార్మాసిస్ట్ లేరని,మందులు సరఫరా లేక విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. బిపి,షుగర్,గుండె సంబంధిత తదితర ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నామని,వెంటనే సంబంధిత మందులు తెప్పించి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ డాక్టర్ వినీత,నాయకులు భగవంతు,ఉమేష్ కుమార్,కేఆర్ రెడ్డి,బొక్క నర్సింహులు,డేవిడ్,రియాజోద్దీన్,మనోహర్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.